ఉల్లి రికార్డ్ రేటు.. కేజీ రూ. 200
ఉల్లి కొంటే కన్నీళ్లు రావాల్సిందే. ఇప్పుడు సామాన్యుడుకి ఉల్లి అందని ద్రాక్షే. దేశ వ్యాప్తంగా ఉల్లి రేటు రోజు రోజుకూ పెరిగిపోతోంది.ఇప్పటికే రిటైల్ ధర కిలో రూ.150 నుంచి 220 మధ్య పలుకుతోంది. హైదరాబాద్ లో కిలో ఉల్లి రేటు రూ. 175 వరకు పలుకుతుంది. తమిళనాడులోని మధురైలో ఇవాళ కిలో ఉల్లిని రూ.200 అమ్మారు. ప్రతిసారి 5 కిలోలు కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పుడు కేవలం ఒక కేజీ మాత్రమే కొంటున్నారని ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు.
వారానికి రూ.350-400 వరకు కేవలం ఉల్లిగడ్డలు కొనుగోలు చేయడానికి ఖర్చు అవుతుందని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగితా కూరగాయల ధరలు ఏమైన అగ్గువగా ఉన్నాయంటే.. అదీ లేదు. అవీ మండిపోతున్నాయి. ఒక్క ములక్కాడ కొనాలంటే రూ. 50. ఓ నాలుగైదు ములక్కాయలు లేనిదే పప్పు చారు కాదు. దాంతో రూ.200 పెట్టాల్సిందే. టపమా, ఇతర కూరగాయలని ముట్టుకొనే పరిస్థితి లేదు. అన్నీ భగ్గున మండుతున్నాయ్. ఇక సామాన్యుడు బతికేదెలా ? ఉల్లిరేటుని కూడా కంట్రోల్ చేయలేని ఈ ప్రభుత్వాలు.. ఆర్థిక మందగమనాన్ని ఎలా తట్టుకొంటాయి.. అన్నది అర్థంకానీ ప్రశ్న.