రెండో టీ20 : విండీస్ టార్గెట్ 171

త్రివేండ్రం వేదికగా వెస్టిండీస్ -భారత్ మధ్య జరుగుతున్న రెండో టీ 20లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వన్ డౌన్ లో వచ్చిన యువ ఆల్ రౌండర్ శివమ్ దూబె 54 (25బంతుల్లో, 3ఫోర్లు, 4సిక్సులు) అదరగొట్టాడు. చివరలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంట్ తన సహజశైలికి భిన్నంగా 33 (22 బంతుల్లో, 3ఫోర్లు, 1సిక్స్) ఆకట్టుకొన్నాడు. సీనియర్లు రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ(19) తక్కువ పరుగులకే పరితమయ్యారు.

ఇక 171 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం టీమిండియాకు అంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే.. ? భయంకరమైన హిట్టర్స్ విండీస్ సొంతం. పైగా వారికి ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉంది. టీమిండియా బౌలింగ్ శైలి, పరిస్థితులు వారికి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణిస్తేనే.. 171 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవచ్చని క్రికెట్ విశ్లేషకుల మాట.