అల.. టీజర్ గ్లింప్స్ :  బన్నీ బ్యాక్ లుక్ యాక్షన్ 

త్రివిక్రమ్-అల్లు అర్జున్ హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’ టీజర్ కి ముహూర్తం ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న టీజర్ రాబోతుంది. తాజాగా టీజర్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ‘లిఫ్ట్ లో వెనక్కి తిరిగి స్టయిలీష్ గా చేతిలో కోర్టు పట్టుకొని నిలబడిన బన్నీ.. కోర్టు వేసుకొంటూ.. కార్పోరేటు ఆఫీస్ లోకి ఎంట్రీ. బోర్డ్ మీటింగ్ లో బెల్లపై నడుచుకుంటూ వెళ్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తుంటే.. సునీల్ మాత్రం ఎంజాయ్ చేస్తుండటం..’ టీజర్ గ్లింప్స్ లో చూడొచ్చు. 

ఈ సినిమా కథ కూడా శ్రీకృష్ణుడి యాంగిల్ లో సాగుతుందట. కృష్ణుడు దేవకి కి పుట్టినా యశోద దగ్గర పెరిగినట్లుగా ఆ పాయింట్ ను ఇప్పటి పరిస్థితులకు అన్వయించి అల.. తెరకెక్కిస్తున్నారని చెప్పుకొంటున్నారు. బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టిన అల్లు అర్జున్ ను అతడి తల్లితండ్రులు ఒక పేద కుటుంబానికి అప్పచేప్పడంతో అక్కడ పెరుగుతాడు. ఐతే, ఆతరువాత అతడు తన కుటుంబ నేపధ్యం గురించి వాస్తవాలు తెలుసుకుని శ్రీకృష్ణుడు గోకులం నుండి ద్వారకకు వెళ్ళినట్లుగా బన్నీ తన పేద ఇంటి నుండి విలాసవంతమైన మహల్ లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నమే అల.. కథని చెబుతున్నారు. టీజర్ గ్లింప్స్ చూసే ఆ ప్రచారం నిజమే అనిపిస్తొంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు.