శ్వేతాబసు.. యేడాది తిరక్కుండానే విడాకులు !
‘కొత్త బంగారులోకం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది శ్వేతాబసు. తొలి సినిమానే హిట్టవ్వడం.. ఆమెకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఐతే, హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. అదేసమయంలో సెక్స్ స్కాండిల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో.. శ్వేతాబసు ఇమేక్ డ్యామేజ్ అయింది. ఫైనల్ ఈ కేసులో ఆమెకి క్లీన్ చీట్ వచ్చిందనుకోండీ.
ఆ తర్వాత జీవితాన్ని ఫ్రెష్ గా స్టార్ట్ చేసిన శ్వేతాబసు హిందీ సీరియల్స్ లో నటించింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసింది. అదే టైమ్ లో రోహిత్ మిట్టల్ లో పరిచయమైంది. గతేడాది పూణెలో వీళ్లు పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న ఈ జంట యేడాది తిరక్కుండానే విడిపోతోంది.
బర్త్ తో విడాకుల విషయాన్ని స్వేతాబసు అధికారికంగా ప్రకటించింది. ‘ఇకపై ఎవరి జీవితాలు వాళ్లవి. ఈ ఏడాది కాలంలో తనకు మధుర జ్ఞాపకాలు అందించినందుకు రోహిత్ కు థ్యాంక్స్. జీవితంలో రోహిత్ కు ఎప్పుడూ ఓ ఛీర్ లీడర్ లా ఉంటా’నని శ్వేతాబసు తెలిపింది. కానీ, విడాకులకి కారణాలు మాత్రం ఆమె వెల్లడించలేదు.