నిర్భయ నిందితుడి పైత్యం విన్నారా.. ?
ఏడేళ్లు గడుస్తున్నా నిర్భయ నిందితులకి ఇంకా ఉరిశిక్ష పడకపోవడంపై విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దిశ నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో.. నిర్భయ నిందితులని వెంటనే ఉరితీయాలనే డిమాండ్ ఊపందుకుంది. 2012లో దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ ఘటనలో మొత్తం ఐదుగురు నిందితుల్లో మైనర్ బాలుడికి మినహా మిగితా నలుగురి కోర్టు ఉరిశిక్షని విధించింన సంగతి తెలిసిందే.
వీరిలో ఒకరు జైల్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోగా, మిగితా ముగ్గురిని త్వరలోనే ఉరితీయనున్నారు. వీరిలో అక్షయ్ సింగ్ తనకు ఉరి విధించడంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. అందులో అతడు పేర్కొన్న కారణాలు విడ్డూరంగా ఉన్నాయి. ఢిల్లీలోని వాయు కాలుష్యం, జల కాలుష్యం కారణంగా తమ ఆయుష్షు సగం క్షీణించిందని, ఇంకా తమకు ఉరిశిక్ష ఎందుకుని పిటిషన్ లో పేర్కొని పైత్యం చూపించాడు.