ముగిసిన NHRC పర్యటన

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) పర్యటన ముగిసింది. వెంటర్నరీ డాక్టర్ దిశని నలుగురు క్రూరులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురి నిందులని తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సీన్ రీ కన్స్ ట్రక్షన్ లో భాగంగా నిందుతులని ఘటన స్థలానికి తీసుకెళ్లగా.. అక్కడ నిందితులు పోలీసులకి ఎదురు తిరిగారు. దాడి చేశారు. తుపాకులు లాక్కోని పోలీసులపై దాడి యత్నించారు. ఈ నేపథ్యంలో.. ప్రాణాలు కాపాడుకోవడానికి నిందితులని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని సీపీ సజ్జనార్ మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే. ఐతే, కావాలనే దిశ నిందితులని తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని మీడియాలో వచ్చిన కథనాలని సుమోటగా తీసుకొని NHRC దర్యాప్తు కోసం హైదరాబాద్ కి వచ్చింది.

నాలుగు రోజుల పాటు దర్యాప్తు చేశారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని.. నిందితుల మృతదేహాలని పరిశీలించారు. దిశ తల్లిదండ్రులతో, నిందితుల తల్లిదండ్రులతోనూ NHRC బృందం భేటీ అయ్యారు. మరోవైపు, తెలంగాణ పోలీసులు ఈ ఎన్ కౌంటర్ పై NHRCకి సంపూర్ణ నివేదిక అందించారు. మొత్తం.. దర్యాప్తుని పూర్తి చేసుకొన్న NHRC ఈరోజు తిరిగి హైదరాబాద్ కు తిరుగు పయనం కానుంది. ఐతే, ఎన్ కౌంటర్ లో మృతి చెందిన నలుగురు నిందితుల్లో ముగ్గురు నిందితులు మైనర్లేననే వార్తలొస్తున్న నేపథ్యంలో.. NHRC ఏం తేల్చబోతుంది ? ఏం చేయబోతుంది ?? అన్నది ఆసక్తిగా మారింది.