మొదలైన పవన్ సినిమా పనులు
పింక్ రిమేక్ తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఐతే, ఈ సినిమా విషయంలో పవన్ అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి చెక్ పెడుతూ.. సినిమా పనులని ప్రారంభించింది చిత్రబృందం. తాజాగా తెలుగు పింక్ మ్యూజిక్స్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి.
ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ ట్విట్ చేసింది. థమన్, వేణు శ్రీరామ్ తో కలిసి దిగిన పిక్ ని దిల్ రాజు అభిమానులతో పంచుకొన్నారు. దీన్ని రీ ట్విట్ చేసిన థమన్ ‘నా ఫస్ట్ బిగ్ జర్నీ.. విత్ అవర్ హీరో’ అని కామెంట్ పెట్టారు. ప్రస్తుతం థమన్ మంచి ఫాలో ఉన్నారు. మంచి పాటలతోపాటు, అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని ఇస్తున్నారు. ఆయన్ని పవన్ సినిమా కోసం తీసుకోవడంతో.. అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ? ఇతర పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. వచ్చే యేడాది జనవరి నుంచి పింక్ రిమేక్ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారమ్.
#godbless
My first very big journey with our hero gaaru ♥️
My third with @dilraju_svc gaaru 🎶✨
& my director #VenuSriram gaaru 🥁
Kick started our compositions today 🎧 https://t.co/riavei2uDa— thaman S (@MusicThaman) December 12, 2019