పాయల్ ఖాతాలో సాంప్రదాయమైన హిట్ 

‘ఆర్ఎక్స్100’తో తెలుగు తెరకు పరిచయం అయింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాతో  గ్లామర్ దేవత అనిపించుకొంది. ఆ తర్వాత ‘ఆర్డీఎక్స్ లవ్’తో పాయల్ పై బోల్డ్ హీరోయిన్ అనే ముద్రపడిపోయింది. ఇక పాయల్ గ్లామర్ రోల్స్ కే పరిమితం అవుతుందని అందరూ భావించారు.

తనకు మంచి పాత్రలు చేయాలని ఉన్నప్పటికీ అలాంటి పాత్రలు రావడం లేదంటూ పాయల్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమె అదృష్టం కొద్దీ.. వెంకీమామలో వెంకీ సరసన నటించే అవకాశం దక్కింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన వెంకీమామ హిట్ టాక్ సొంతం చేసుకొంది. దీంతో పాయల్ ఖాతాలో సాంప్రదాయమైన హిట్ పడినట్టయింది. మరీ.. ఇప్పటికైనా.. పాయల్ పద్దతి మారి.. ఫ్యామిలీ హీరోయిన్ అనిపించుకుంటుదేమో చూడాలి.