‘సరిలేరు నీకెవ్వరు’ మేకింగ్ వీడియో చూశారా.. ?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇటీవల ఈ సినిమా సెట్స్ లో ‘మై విలేజ్ షో’ టీం సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూట్యూబ్ సంచలనం గంగవ్వ సరిలేరు నటిస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ, అందులో నిజం లేదు.

‘మై విలేజ్ టీం’ సరిలేరు షూటింగ్ స్పాట్ కెళ్లి సినిమా విశేషాలని తెలుసుకొంది. కొన్ని మేకింగ్ సీన్స్ ని షూట్ చేసింది. గంగవ్వ దర్శకుడు అనిల్ రావిపూడిని ఇంటర్వ్యూ చేసింది. సెట్స్ మొత్తం తిరిగి అక్కడి పరిస్థితులని తనదైన శైలిలో వివరించింది. ఫైనల్ గా.. సూపర్ స్టార్ మహేష్ బాబు, లేడీ సూపర్ స్టార్ మహేష్ బాబు, చిత్రబృందంతో కలిసి ఫోటోలు దిగారు. ఇప్పుడీ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ చిత్రంలో మహేష్ కి  జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. ఇందులో మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సరిలేరు వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.