మరోసారి చంద్రబాబుని కాపాడిన పవన్ ?!
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పోలవరం పనులని పరిశీలిస్తున్నారు. ఈ ఉదయం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకొన్న పవన్.. ప్రాజెక్టు పనుల గురించి అధికారులని అడిగి తెలుసుకొంటున్నారు. తన షెడ్యూల్’లో లేకున్నా పవన్ సడెన్’గా పోలవరం పర్యటనకు వెళ్లడం వెనక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోసారి టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కాపాడేందుకే పవన్ పోలవరం సందర్శనకు వెళ్లారని వైసీపీ ఆరోపిస్తోంది.
ఇటీవల పోలవరం పనులపై కేంద్రం అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ భాజాపా నేతలతో సమావేశమైన చంద్రబాబు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలవరం అవకతవకలపై హీట్ చల్లారడం లేదు. ఈ క్రమంలో నేడు వైసీపీ అధినేత పోలవరం సందర్శించేందుకు ప్లాన్ చేసుకొన్నారు. ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా ఈరోజే పోలవరం వెళ్లే పనిని పెట్టుకొన్నారు. వైసీపీ, ఏపీ-కాంగ్రెస్ నేతలు మరోసారి పోలవరం మేటరుని జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ చేస్తారని చంద్రబాబు ముందే ఊహించారట.
ఈ నేపథ్యంలోనే సడెన్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పోలవరం విజిట్ చేయించారన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ. పవన్ పోలవరం విజిట్ తో ఫోకస్ అంతా పవన్ పైనే పడుతుంది. పవన్ క్రేజీ ముందు వైసీపీ, ఏపీ-కాంగ్రెస్ నేతలు ఎన్ని చెప్పిన అవి కేంద్రం దాక వెళ్లవన్నది బాబు ప్లాన్ అని చెప్పుకొంటున్నారు. వినడానికి, చూడ్డానికి ఇదే నిజమే అనిపించినా.. వాస్తవంగా ఏం జరిగింది ? అన్నది ఆ దేవుడే తెలియాలి మరీ.. !