తేజు.. మాస్’ని మరచిపోలె.. !
మెగా యంగ్ హీరో సాయి తేజ్ రొటీన్ మాస్, యాక్షన్ కథలతో ప్రేక్షకులకి బోర్ కొట్టించిన సంగతి తెలిసిందే. ఆయన మారి చేసిన ‘చిత్రలహరి’ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో మాస్ కథల జోలికి వెళ్లకూడదని తేజు నిర్ణయించుకొన్నాడట. ఇకపై ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమాలు చేయాలని తేజు డిసైడ్ అయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మారుతి దర్శకత్వంలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ప్రతిరోజూ పండగే’ చేస్తున్నాడు.
ఈ నెల 20న ప్రతిరోజూ పండగే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఈ సినిమాలోనూ తేజు మాస్ ని మరచిపోలేదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం తేజు సిక్స్ ప్యాక్ బ్యాడీ చేశాడు. సినిమాలో వచ్చే రెండు యాక్షన్ సీన్స్ లో తేజు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తేజు సిక్స్ ప్యాక్ బాడీకి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోలు, కుర్ర హీరోలు సిక్స్ ప్యాక్ బాడీ చేసి చూపించారు.
ఇప్పుడు తేజు కూడా కండలు పెంచాడు. ఆరు పలకల బాడీ చేశారు. ఐతే, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కోసం తేజు సిక్స్ ప్యాక్ బాడీ చేయడం విశేషం. బహుశా.. ఇన్నాళ్లు తనని ఫాలో అయిన.. మాస్ ప్రేక్షకులు కోరుకున్న డిస్సాపాయింట్ చేయకూడదనే తేజు సిక్స్ ప్యాక్ చేసినట్టు అర్థమవుతోంది. ఈ చిత్రంలో తేజు కి జంటగా రాశీఖన్నా నటించింది. సత్యరాజు కీలక పాత్రలో నటించారు.