2019 – టాప్ టీఆర్ఫీ రేటింగ్ తెచ్చిన సినిమాలివే.. !

2019కి గుడ్ బాయ్ చెప్పే రోజులు దగ్గరపడుతున్నాయి. ఈ యేడాది టాలీవుడ్ నుంచి మంచి సినిమాలొచ్చాయ్. విభిన్నమైన సినిమాలొచ్చాయ్. ఆ కథలు బాలీవుడ్ ని ఆకర్షిస్తున్నాయి. ఈ యేడాది వచ్చిన ఎఫ్ 2, మజిలీ, జెర్నీ సినిమాలని బాలీవుడ్ రిమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ యేడాది టాప్ టీఆర్ఫీ రేటింగ్ సాధించిన సినిమాలని విషయానికొస్తే.. ‘ఎఫ్ 2’ మొదటి స్థానంలో ఉంది. ఏకంగా 17.2 టీఆర్ఫీ రేటింగ్ ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా వచ్చిన ఎఫ్2 అసలు సిసలు సంక్రాంతి సినిమా అనిపించుకొంది. అత్యధిక లాభాలు తీసుకొచ్చిన తెలుగు సినిమాగా రికార్డులు సృష్టించింది. బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్స్ ని నమోదు చేసింది.

ఎఫ్ 2 తర్వాత స్థానంలో ‘ఇస్మార్ట్ శంకర్’ నిలిచింది. ఈ సినిమాకు 16.63 టీఆర్ఫీ రేటింగ్ లభించింది. మూడో స్థానంలో ‘కాంచన 3’, నాల్గో స్థానంలో మహర్షి (9.2) ఆ తర్వాత స్థానాల్లో ఓ బేబీ (9), జెర్సీ (8.8), మజిలీ (7.9) సినిమాలు నిలిచాయి. ఇక ఎఫ్ 2, జెర్సీ, మజిలీ సినిమాల గురించి ఈ యేడాది ప్రేక్షకులు ఎక్కవగా మాట్లాడుకొన్నారు.