సానియా చెల్లెలు పెళ్లిలో చరణ్ డ్యాన్స్.. వీడియో !

సానియా మీర్జా చెల్లెలు వివాహం మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కొడుతో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలో రామ్ చరణ్ దంపతులు సందడి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా హాజరయ్యారు. 

ఇక పెళ్లి వేడుకలో సానియా మీర్జా, ఫరాఖాన్ తో కలిసి రామ్ చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చరణ్ సానియా, ఫరాఖాన్ మధ్యలో చిరునవ్వులు చిందిస్తూ.. చిందిలేశాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఆయనకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. మరో కథానాయకుడిగా ఎన్ టీఆర్ నటిస్తున్నారు. ఆయన కొమరం భీంగా కనిపించనున్నారు. ఆయనకి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా కనిపించనున్నారు. వచ్చే యేడాది జులై 30న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.