రూలర్ టైటిల్ సీక్రెట్ 

సీనియర్ దర్శకుడు కె.యస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం ‘రూలర్’. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు. భూమిక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందించారు. సి. కల్యాణ్ నిర్మాత. ఈ నెల 20న ‘రూలర్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

శనివారం రూలర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ విశాఖలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోయపాటి ‘రూలర్’ టైటిల్ నాదే అన్నారు.బాలకృష్ణకు సూట్ అయ్యే టైటిల్ ఇది. ఆయన కోసమే ఈ టైటిల్‌ను రిజిష్టర్ చేయించానని తెలిపారు. ఇక బాలయ్య-బోయపాటిలది హిట్ కాంబో.

వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుంది.