మామ-అల్లుళ్లకి హిట్ ఇచ్చిన దర్శకులు

పైన ఫోటోలో ముగ్గురు దర్శకులు.. ఇద్దరు హీరోలు ఉన్నారు. ఈ ముగ్గురు దర్శకులు.. ఆ ఇద్దరి హీరోలకి హిట్ ఇచ్చినవారే. ఈ యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఎఫ్2’ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రమిది. అసలుసిసలు సంక్రాంతి సినిమా అనిపించుకొంది. అత్యధిక లాభాలు తీసుకొచ్చిన తెలుగు సినిమాగా నిలిచింది.

ఇక ‘మజిలీ’లో చైతూ సూపర్ హిట్ ఇచ్చారు శివ నిర్వాణ. చైతూ-సమంత జంటగా నటించిన ‘మజిలీ’ మంచి సినిమా అనిపించుకొంది పెళ్లి తర్వాత సామ్-చై కలిసి నటించిన చిత్రమిది. అంతేకాదు.. చైతూ బెస్ట్ ఫర్ ఫామెన్స్ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. ఇక వెంకీ, చైతూ కలిసి నటించిన వెంకీమామ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తుంది. 

ఆదివారం వెంకీమామని దర్శకులు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ తో కలిసి మామ అల్లుళ్లు చూసినట్టున్నారు. ఆ సందర్భంగా తీసుకొన్న ఫోటోనే పైది. ఇప్పుడీ పిక్ ని చూసి.. మామ-అల్లుళ్లకి హిట్ ఇచ్చిన దర్శకులు అని చెప్పుకొంటున్నారు. ఇక వెంకీమామ రెండ్రోజుల్లోనే రూ. 15కోట్లపైగా షేర్ ని తీసుకొచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.