హీరోయిన్ పాయల్ అరెస్ట్
నటి పాయల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రుపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన నటి, మోడల్ పాయల్ రోహత్గీని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నెహ్రు కుటుంబాన్ని దూషిస్తూ, జవహర్ లాల్ నెహ్రు సతీమణి గురించి అసభ్యకరంగా మాట్లాడిన ఓ వీడియోను పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్గాలు ఆమె మండిపడ్డాయి. ఆమెపై పోలీసులకి ఫిర్యాదు చేశారు.
యువజన కాంగ్రెస్ లీడర్ చర్మేశ్ శర్మ పాయల్ వీడియోపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పాయల్ ని అరెస్ట్ చేశారు. పోలీసుల ఐటీ చట్టం ప్రకారం ఆమెని అదుపులోనికి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని పాయల్ ధృవీకరించారు. ‘మోతీలాల్ నెహ్రు గురించి ఓ వీడియో చేసినందుకు రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. గూగుల్ నుంచి సమాచారాన్ని తీసుకుని నేను ఆ వీడియో చేశాను. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు జోక్ అయిపోయింది.’ అని ఆమె తెలిపారు.