‘అ’లో అవసరాల ఫస్ట్ లుక్

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ‘వాల్ పోస్ట‌ర్’ బ్యాన‌ర్ పై నాని స‌మ‌ర్ప‌ణ‌లో ‘అ’ సినిమా తెరకెక్కుతోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఇప్పటికే 80% షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇటీవలే నాని ‘అ’ నుంచి ఫస్ట్ లుక్, నిత్యామీనన్ లుక్స్ బయటికొచ్చాయి. తాజాగా, సినిమాలో అవసరాల శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ పోస్ట‌ర్’లో సైంటిస్ట్ లుక్ లో అవ‌స‌రాల కనిపిస్తున్నాడు.

ప్ర‌శాంత్ వ‌ర్మ చెప్పిన క‌థ నానీకి న‌చ్చ‌డంతో అత‌డికే దర్శ‌కుడిగా తొలి అవ‌కాశం ఇస్తూ, తానే నిర్మాత‌గా మారాడు. తెలుగులో ఇప్పటి వరకు రాని కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని నాని చెబుతున్నాడు. ఈ సినిమాలో నిత్యా మీన‌న్, కాజ‌ల్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. నానితో పాటు మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ అందించనున్నారు.