ఎంపీ అరవింద్ రాజీనామా డిమాండ్
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సమయంలో నిజమాబాద్ లో పసుపు బోర్డ్ ఏర్పాటుపై అరవింద్ రైతులకి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ మేరకు బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. దాంతో తెరాస అభ్యర్థి కవితని కాదని అరవింద్ ని గెలిపించారు నిజమాబాద్ రైతులు. ఇప్పుడేమో.. పసుపు బోర్డు ఏర్పాటు అసాధ్యమని.. బోర్డు కంటే మంచి పరిష్కారం దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అంటున్నారు అరవింద్. ఈ నేపథ్యంలో ఎంపీ అరవింద్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన ఎంపీ పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సాధన సమితి డిమాండ్ చేస్తుంది. ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలని సాధన సమితి ఆందోళనకి దిగనుంది. మరోవైపు, ప్రభుత్వం పసుపుకి మద్దతు ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఎంపీ అరవింద్ అంటున్నారు. రైతులు మాత్రం.. అవేవి వద్దు. తమకి బోర్డు మాత్రమే కావాలనే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ రాజకీయాలు హీటెక్కాయి.