పవన్’కి నో చెప్పిన సమంత

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా ? కానీ స్టార్ హీరోయిన్ సమంత పవన్ కి నో చెప్పినట్టు తెలుస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘పింక్’  బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, తాప్సీ కీలక పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలో తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బోనీ కపూర్ తో కలసి దిల్ రాజు నిర్మించనున్నారు.

 ఇందులో ప్రధాన పాత్ర పోషించిన తాప్సీ రోల్‌కి మొదట సమంతాను సంప్రదించిందట చిత్ర యూనిట్. అయితే సామ్ మాత్రం ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. దీంతో.. ఆ అవకాశం నివేదా థామస్ కి వచ్చినట్టు తెలుస్తోంది. పింక్ చిత్రంలో తాప్సీ పోషించిన పాత్రను తెలుగులో నివేదా చేయనున్నారు. ఐతే, దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.