మెగా సెంటిమెంట్ వర్కవుట్ అయితే.. ‘ప్రతిరోజూ పండగే’ బ్లాక్ బస్టర్ హిట్ !

సినిమాలకి సెంటిమెంట్స్ ఎక్కువ అంటారు. దర్శకుడు మారుతికి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. తన కథని మెగాస్టార్ చిరంజీవి కథ వినేసి.. బాగుందంటే అది బ్లాక్ బస్టర్ హిట్టే. ‘భలే భలే మగాడివోయ్’ కథని ముందు మారుతి మెగాస్టార్ కి వినిపించాడట. కథ బాగుంది. మంచి హిట్ అవుతుంది అన్నారట. అన్నట్టుగానే.. మారుతి-నాని కాంబోలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి వరకు మారుతిపై ఉన్న బూతు ముద్రని చెపేసింది.

ఇప్పుడు ‘ప్రతిరోజూ పండగే’ విషయంలోనూ మెగా సెంటిమెంట్ రిపీట్ అయ్యేలా ఉందన్నారు మారుతి. మారుతి దర్శకత్వంలో సాయితేజు-రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్ లో ఈ సినిమా పీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగామ మారుతి మాట్లాడుతూ.. భలే భలే మగాడివోయ్ కథని మెగాస్టార్ ముందే విన్నారు. ఇప్పుడు పండగ కథని చిరు విన్నారు. బాగుందని కితాబిచ్చారు. ట్రైలర్ చూసి మెసేజ్ పెట్టారు. బహుశా.. మెగా సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో. ప్రతిరోజూ పండగే సూపర్ హిట్ అవుతుందేమో అన్నారు మారుతి.