టీడీపీ ఇళ్ల దోపీడిని బయటపెట్టిన బొత్స
ఏపీలో రివర్స్ టెండరింగ్ వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఇవాళ అసెంబ్లీ తెదేపా నేతలు లేవనెత్తారు. దానికి మంత్రి బొత్స ధీటైన సమాధానం ఇచ్చారు. తెదేపా హయాంలో దోపిడీ, అవినీతి జరగడం వల్లే.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్ళామని ఆయన స్పష్టం చేశారు.
ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ వలన దాదాపు రూ.106 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 3 లక్షల ఇళ్లకు సుమారు రూ.2 వేల 626 కోట్లని తెదేపా దోపిడీని చేసిందని బొత్స తెలిపారు. లబ్దిదారుడి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా ఇళ్లను ఇవ్వాలని సీఎం జగన్ సూచించినట్లు మంత్రి వివరించారు.