సరిలేరు నీకెవ్వరు : #HeIsSoCute సాంగ్ వచ్చేసింది

సూపర్ స్టార్ మహేష్ బాబు అల్లాడిస్తున్నాడు. ఆయన అందానికి ముద్దుగుమ్మ రష్మిక మందన ఫిదా అయిపోయింది. మహేష్ అందాన్ని పొగుడుతూ రస్మిక ఓ పాటేసుకొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వీరిద్దరు జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి #HeIsSoCute సాంగ్ ని విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పాటని మధుప్రియ పాడింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రాజు సుందరం నృత్యాలు సమకూర్చాడు. కొన్ని సాంగ్ సీన్స్, కొన్ని మేకింగ్ సీన్స్ తో  #HeIsSoCute లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. జలపాతల లొకేషన్స్ లో ఈ పాటని చిత్రీకరించారు. వాటిని చూస్తే.. బాహుబలి సినిమాలోని జలపాతాల ఏపీసోడ్ గుర్తుకువస్తుంది.