అల.. రెండు ఫంక్షన్స్ ప్లాన్ చేశారట !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఆకలితో ఉన్నారు. వాళ్ల ఆకలిని తీర్చాలనే కసితో బన్నీ పని చేస్తున్నారు. ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ బాగా గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. గ్యాప్ తీసుకోలేదు. వచ్చిందని ‘అల.. వైకుంఠపురంలో’ టైటిల్ ప్రోమోలో క్లారిటీ ఇచ్చారు బన్నీ. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

రిలీజ్ కి ముందే అల.. రికార్డులని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సామజవరగమన, రాములో.. రాముల పాటలు అత్యధిక వ్యూస్ సొంతం చేసుకొని సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇటీవల వచ్చిన అలా.. టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ ఉత్సాహంతో అల.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని చిత్రబృందం గ్రాండ్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది.

ఒకటి కాదు.. రెండు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ప్లాన్ చేశారట. ఈ నెల 28న హైదరాబాద్ లో అల.. మ్యూజికల్ నైట్ నిర్వహిస్తారట. ఇక జనవరి 5న వైజాగ్‌లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో అల.. ఫంక్షన్స్ జరగనున్నాయి. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. యంగ్ హీరోలు సుశాంత్, నవదీప్ లకి మంచి పాత్రలు దక్కాయి. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.