విజయ్ దేవరకొండ స్టార్ హీరో.. అంతకుమించి ! ఇదిగో రుజువు !!

‘పెళ్లి చూపులు’తో తొలి హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలని మించిపోయాడు. స్టార్ హీరోల కంటే ఎక్కువగా విజయ్ తోనే సినిమా చేసేందుకు దర్శక-నిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు నిజంగా విజయ్ టాలీవుడ్ స్టార్ హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్ లని మించిపోయాడు. విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా 5 మిలియన్ల ఫాలోవర్స్‌కు చేరుకుంది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఇన్‌స్టా ఖాతాను 3.8 మిలియన్ల మంది, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఖాతాను 4.6 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఇప్పుడు వీరిని విజయ్ దాటేశాడు. విజయ్ గతేడాది ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచాడు. ఆయన ఫాలోవర్స్ సంఖ్య చాలా వేగంగా  5 మిలియన్స్ కి చేరుకుంది.

ప్రస్తుతం విజయ్ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో నటిస్తున్నారు. ఇందులో ఆయన నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్‌, ఇజబెల్లా లేట్చి, కేథరిన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. వచ్చే యేడాది ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.