వైరల్ : శృతిహాసన్ పెళ్లి ఫిక్స్
హీరోయిన్ శృతి హాసన్ పెళ్లి ఫిక్స్.. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లండన్’కు చెందిన శృతి భాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్పెల్.. కమల్ కుటుంబంతో కలిసి కలియ తిరగడమే ఈ ప్రచారానికి కారణం. ఇటీవలే చెన్నైలో ఓ నటుడి పెళ్లికి కమల్ కుటుంబంతో కలిసి మైఖేల్ హాజరు కావడం సంచలనం కలిగించింది. ఈ వేడుకకి మైఖేల్ కోర్సేల్ పంచె కట్టులో తమిళ తంబిలా తయారై హాజరయ్యారు.
ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవలే తన భాయ్ ఫ్రెండుని శృతి తన తల్లికి పరిచయం చేసింది. ఆమె ఓకే చెప్పిందనే వార్తలొచ్చాయి. ఇప్పుడు కమల్ కుటుంబంతో మైఖేల్ కలిసి తిరగడంతో.. కమల్ కూడా శృతి ప్రేమ పెళ్లికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శృతిహాసన్ పెళ్లి ఫిక్దయ్యింది. వచ్చే యేడాది వీరి పెళ్లి జరగనుందని చెబుతున్నారు.
ప్రస్తుతం శృతికి సినిమా అవకాశాలు లేవు. ఈ గ్యాప్ ప్రియుడు మైఖేల్ కోర్పెల్ చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెట్ అవ్వడానికి ప్లాన్ చేసుకొందని చెప్పుకొంటున్నారు. మరీ.. శృతి ఎప్పుడు పెళ్లి భోజనం పెడుతుంది ? అన్నది చూడాలి.