‘నిశ్శబ్ధం’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

‘భాగమతి’ తర్వాత స్వీటీ అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్ధం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన సెలబ్రెటీ మ్యూజిషియన్ గా అంథోని అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అంజలి, షాలినీ పాండే, హాలీవుడ్ యాక్టర్ మైకేల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘నిన్నే నిన్నే.. ‘ ప్రోమోని విడుదల చేశారు. అనుష్క-మాధవన్ పై ఈ సాంగ్ ని చిత్రీకరించారు. అందమైన లోకేషన్స్ లో ఈ సాంగ్ ని చిత్రీకరించారు. అనుష్క-మాధవన్ ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. భాస్కర భట్ల రాసిన ఈ పాటని.. సిద్ శ్రీరామ్ ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. త్వరలోనే ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు.