కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య

కర్నూలు జిల్లాలో పాత కక్షలో భగ్గుమన్నాయి. టీడీపీ నేత దారుణ హత్యకి గురయ్యాడు. కొలిమిగండ్ల మండలం చింతలాయపల్లిలో టీడీపీ నేత మంజుల సుబ్బారావుని ప్రత్యర్థులు వేట కొడవళ్లతో అతి దారుణంగా తల నరికి చంపారు. మృతుడు సుబ్బారావు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ కి ప్రధాన అనుచరుడని చెబుతున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కక్ష్య సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి. టీడీపీ నేతలపై వరుసగా దాడులు జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో తాజా హత్య ఏపీ రాజకీయాలని మరోసారి హీటెక్కించేలా ఉంది. ప్రస్తుతం పోలీసులు నిందితులని పట్టుకొనే వేటలో ఉన్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.