లింగభేదం సూచిలో భారత్ స్థానం 112

2019వ సంవత్సరానికి గాను జెండర్ గ్యాప్ ఇండెక్స్ (లింగ భేద సూచీ)ను వరల్డ్ ఎకనమిక్ ఫోరం విడుదల చేసింది. ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలు పాల్గొనేందుకున్న అవకాశాలు, విద్య, రాజకీయ సాధికారిత, ఆరోగ్యం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ సూచీని వరల్డ్ ఎకనిక్ ఫోరం రూపొందిస్తుంటుంది.

ఈ సూచిలో భారత్ కు 112వ స్థానం దక్కింది. గత యేడాది ఈ సూచిలో భారత్ స్థానం 108గా ఉండేది. ఈ యేడాది నాలుగు స్థానాలు దిగజారి 112స్థానంలో నిలిచింది. లింగభేద సూచీలో ఐస్ లాండ్ అగ్ర స్థానంలో నిలవగా,  పొరుగుదేశాలైన చైనా 106, నేపాల్ 101, బంగ్లాదేశ్ 50వ స్థానాలతో మన కంటే ముందున్నాయి. చివరి స్థానం 153వ ర్యాంక్ లో యెమెన్ ఉండగా, పాకిస్థాన్ చివరి నుంచి మూడో ర్యాంకులో ఉంది.

ప్రపంచంలో లింగ భేద సమస్య తొలగిపోవడానికి మరో 99.5 సంవత్సరాలు పడుతుందని నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో మహిళల పాత్ర పెరగడం లింగభేదం తగ్గడానికి కారణమని తెలిపింది.