ఏపీకి మూడు రాజధానులు.. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన !
కొన్నాళ్లుగా ఏపీ రాజధాని అమరావతి మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ అసెంబ్లీలో ఏపీ రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రకరణ మంచి నిర్ణయమన్న సీఎం జగన్.. ఏపీకి మూడు రాజధానులు రావచ్చన్నారు.
అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ఉండొచ్చన్నారు సీఎం జగన్. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక అందజేయనుంది. దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దక్షిణాఫికా తరహా అధికార వికేంద్రీకరణ ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.