ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

మియాపూర్‌ మదీనాగూడలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్‌ విద్యార్థినిని దుండగులు దారణంగా హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కొండల్లో పడేశారు.
అమీన్‌పూర్‌ సమీపంలోని కొండల్లో విద్యార్థిని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

విద్యార్థినిని చాందిని జైన్‌గా గుర్తించారు. బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆమె ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతుంది. ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లిన చాందిని తిరిగిరాలేదు. ఈనెల 9న సాయంత్రం స్నేహితులతో పార్టీ అని చాందిని ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి ఆమె సెల్‌కు ఫోన్‌ చేస్తే కలవలేదని ఆమె అక్క నివేదిత తెలిపింది. దీంతో అదే రోజు రాత్రి మియాపూర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

సైబరాబాద్‌ సంయుక్త పోలీసు కమిషనర్‌ ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పథకం ప్రకారమే చాందిని హత్యకు గురైందని ఆమె అక్క నివేదిత ఆరోపిస్తున్నారు.