రాజ్ తరుణ్ ఇలా ఇరుక్కుపోయాడేంటీ !

వచ్చే యేడాది సంక్రాంతికి విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి రావాల్సిన వెంకీమామ, ప్రతిరోజూ పండగే, రూలర్ సినిమాలు డిసెంబర్ లోనే వచ్చేస్తున్నాయి. ఈ నెల 13నే వెంకీమామ వచ్చేశాడు. హిట్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. ఈ వారం (డిసెంబర్ 20) రూలర్, ప్రతిరోజూ పండగ సినిమాలు రాబోతున్నాయి. ఈ మూడు సినిమాలు సంక్రాంతి వరకు సందడి చేయనున్నారు.

ఇక సంక్రాంతి కానుకగా జనవరి 9న సూపర్ స్టార్ రజనీ కాంత్ దర్భార్, జనవరి 11న మహేష్ సరిలేరు నీకెవ్వరు, 12న అల్లు అర్జున్ అల.. వైకుంఠపురంలో, 15న కల్యాణ్ రామ్ ఎంతమంచివాడవురా సినిమాలు రాబోతున్నాయి. ఇటు డిసెంబర్ సినిమాలు అటు సంక్రాంతి సినిమాలకి మధ్య అన్నట్టుగా డిసెంబర్ 25న రాజ్ తరుణ్ ‘ఇద్దరిలోకం ఒక్కటే’ సినిమా రిలీజ్ కాబోతుంది. తీవ్ర పోటీ మధ్య రాజ్ తరుణ్ ఏ మేరకు సత్తా చాటుతాడు అన్నది చూడాలి.

ఈ చిత్రానికి కొత్త దర్శకుడు జీఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ తరుణ్-షాలినీ పాండే జంటగా నటించారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తాజగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇందులో రాజ్ తరుణ్ కొత్తగా కనిపిస్తున్నాడు. స్టోరీ లైన్ మాత్రం పాతదిగానే కనిపిస్తోంది. ఉదయ్ కిరణ్ ‘మనసంతా నువ్వే’, ప్రభాస్ బుజ్జిగాడు స్టోరీలైన్ ని తలపిస్తోంది.