దిశ నిందితుల దారుణాలు.. 9మందిని చంపేశారట !
దిశ నిందితులని గురించి సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. దిశపై అఘాయిత్యానికి పాల్పడక ముందే అనేక ఘోరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారమ్. దాదాపు 15మంది మహిళలని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దిశ ప్రధాన నిందితుడు 9మందిని, చెన్నకేశవులు ముగ్గురిని హత్య చేసినట్టు చెబుతున్నారు.
దిశను రేప్ చేసి అనంతరం పెట్రోల్ పోసి ఎలా అయితే సజీవ దహనం చేశారో అదే రీతిలో.. హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, కర్ణాటక హైవేలపై 15 కేసులు కేసులని గుర్తించారు. వీటిలో 9 కేసుల్లో దిశ నిందితులు ఆరిఫ్, చెన్నెకేశవుల ప్రమేయ ఉందని.. వారి డిఎన్ ఏ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది.
ఈ 9మందిపై ముందు లైంగిక దాడి చేసి.. హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సిట్ బృందంతోపాటు, పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన నాలుగు బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వీరి దర్యాప్తులో దిశ నిందితుల ఘోరాలు వెలుగులోనికి వచ్చినట్టు తెలుస్తోంది.