‘జాన్’ రిలీజ్ డేటు ఫిక్స్ 

‘సాహో’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్). పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రానికి జిల్ ఫేం రాథాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రమిది. యూరప్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. 

ఇందులో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. సాహో ఆశించిన స్థాయిలో ఆడని నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ జాన్ పై భారీ అంచనాలని పెట్టుకున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

ప్రస్తుతం జెడ్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటున్న జాన్ వచ్చే యేడాది సమ్మర్ కు రిలీజ్ అవుతుందని సమాచారమ్. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? ‘జాన్’ దసరాకి రాబోతున్నట్టు తెలిసింది. దసరా సెలవులన్నీ వాడుకునేలా జాన్ రిలీజ్ ని ప్లాన్ చేయనున్నారట. దసరా అంటే చాలా లేటు రిలీజ్ అనే చెప్పాలి. దీంతో.. మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూడక తప్పదు.