బీజేపీ ఎంపీకి కొమ్ములు పెట్టారు

నిజమాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఐదు రోజుల్లోనే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని, లేకుంటే పదవికి రాజీనామా చేస్తానని లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో బాండ్‌ పేపర్‌పై రాసిచ్చారు అరవింద్.

ఇప్పుడు మాత్రం పసుపుబోర్డ్ ఏర్పాటు సాధ్యం కాదని.. ప్రత్యామ్నాయాలని ఆలోచిస్తున్నామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పసుపు రైతులు ఎంపీ అరవింద్ పై మండిపడుతున్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్‌ 31లోగా బోర్డు తేకపోతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. బుధవారం విద్యార్థి జేఏసీ ఎంపీ అరవింద్ కి కొమ్ములు పెట్టిన పోస్టర్ తో ఆందోళనకి దిగారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.