మొన్న వాణిజ్య దళారులు.. ఇప్పుడు సాంస్కృతిక దళారులు..!?
హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలపై విప్లవ రచయితల సంఘం తీవ్రంగా స్పందించింది. ప్రపంచ మహాసభలను విరసం సంపూర్ణంగా వ్యతిరేకిస్తోందన్నారు విరసం నేత వరవరరావు. అగ్రవర్ణ భూస్వామ్య భావజాలాన్ని ప్రచారం చేయటానికే ఈ ప్రపంచ తెలుగు మహాసభలని విమర్శించారు. రెండు రాష్ట్రాల తెలుగు భాష వేరు అని పోరాడిన వ్యక్తే ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇటీవల జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రేంయూర్షిప్ సమ్మిత్ కు కొనసాగింపే ఈ తెలుగుమహాసభలన్నారు వరవరరావు. 350 మందిని నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ చేసినందుకైనా ఈ సమావేశాలను బహిష్కరించాలన్నారు. మొన్న వాణిజ్య దళారులు వచ్చారు.. ఇప్పుడు సాంస్కృతిక దళారులు వస్తున్నారని ఎద్దేవా చేశారు.
గతంలో తిరుపతి లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలను కేసీఆరే వ్యతిరేకించారని, వెంగళరావు వ్యూహమే కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు విరసం నేత వరవరరావువ. ఆంధ్రము వేరు తెలుగు వేరు అని నందిని సిధా రెడ్డి ఇప్పుడు చేస్తున్నది ఏమిటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులో జరగబోతున్న తెలుగు మహా సభలను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.