రాజధానిలో రైతు బంద్

ఏపీకి మూడు రాజధానులని సీఎం జగన్ ప్రకటనపై రాజధాని రైతులు ఆందోళనకి దిగారు. నేడు రాజధానిలో 29 గ్రామాల్లో బంద్‌కు రైతులు బంద్ పాటిస్తున్నారు. రైతులు, కూలీలు వెలగపూడిలో రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని ఉండాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

తామంతా రాజధాని కోసమే భూములిచ్చామని, ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పారని.. ఇప్పుడు మాత్రం రాజధానిని ముక్కలు చేయాలని చూస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, రాజధాని రైతుల ఆందోళననేపథ్యంలో అమరావతి ప్రాంతంలో పోలీసులు 144, 34 సెక్షన్స్ విధించారు.  రైతులు తమ ఆందోళనలు శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.