రోహిత్ హిట్టయితే.. అంతే !


తనదైన రోజుని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎవరూ ఆపలేరు. ఇక ఆయన ఓపిగ్గా సెంచరీ చేశాడంటే.. డబుల్ సెంచరీపై కన్నేసినట్టే. బుధవారం విశాఖ వన్ డేలోనూ రోహిత్ (159, 138బంతుల్లో) వీరవిహారం చేశాడు. మొదట్లో ఆచితూచి ఆడిగిన హిట్ మ్యానే.. ఆ తర్వాత గేర్ మార్చాడు. ఇక సెంచరీ తర్వాత ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. మరోసారి డబుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, 159 పరుగుల వద్ద అవుట్టయ్యాడు.

ఇక ఈ యేడాది కూడా అత్యధిక సిక్సర్స్ బాదిన ఆటగాడిగా రోహిత్ తన రికార్డుని తానే బ్రేక్ చేశాడు. గత యేడాది వన్ డేలో అత్యధిక సిక్సులు (74) బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచారు. ఈయేడాది రోహిత్ ఇప్పటికే 75 సిక్సులు బాదాడు. కేఎల్‌ రాహుల్‌(102; 104 బంతుల్లో 8×4, 3×6) కలిసి రోహిత్ తొలి వికెట్‌కు 227 పరుగుల ద్విశతక భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.

రెండో వన్డేలో స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌, పేసర్‌ మహ్మద్‌ షమి మూడు వికెట్లు సాధించడంతో టీమిండియా 107 పరుగులతో ఘన విజయం సాధించింది. 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. దీంతో 1-1తో సిరీస్‌ సమమైంది