అల.. అక్కడ రికార్డ్స్ పక్కా !

త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకొన్నాయి. ఇక సంగీత దర్శకుడు థమన్ మంచి పాటలతోపాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో.. ఓవర్సీస్ లో అల.. రికార్డులు బద్దలుకొట్టబోతుందని చెబుతున్నారు. సాధారణంగానే త్రివిక్రమ్ సినిమాలకి ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంటుంది. అల.. పాటలు అదిరిపోవడం, మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో ఓవర్సీలో అల.. రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు.

ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. సుశాంత్, జయరామ్, టబు, సముథిరఖని, నవదీప్, నివేత పేతురాజ్, సునీల్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.