‘వెంకీమామ’పై మెగాస్టార్ రివ్యూ

విక్టరీ వెంకటేష్, ఆయన మేనల్లుడు నాగచైతన్య కలిసి నటించిన చిత్రం ‘వెంకీమామ’. కె.యస్ రవీంద్ర (బాబీ) దర్శకుడు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘వెంకీమామ’ హిట్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తోంది. సినీ స్టార్స్, ప్రేక్షకులు ‘వెంకీమామ’ బాగున్నాడంటూ కితాబిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఏకంగా వెంకీమామపై కంప్లీట్ రివ్యూనే అందించారు.

బుధవారం మెగాస్టార్ ఫ్యామిలీతో కలిసి వెంకీమా సినిమా చూశారు. ఆ తర్వాత సినిమా గురించి ఓ చిన్నిపాటి రివ్యూనే అందించారు. “మా ఫ్యామిలీతో కలిసి వెంకీమామ సినిమా చూడటం జరిగింది. మాకు బాగా నచ్చింది. నచ్చడమే కాదు. బాగా ఎంజాయ్ చేశాం. దానికి కారణం విక్టరీ వెంకటేష్. ఆయన తనదైన స్టయిల్ లో కామెడీ, ఎమోషన్స్ తో ఒప్పించి.. ఒప్పించడమే కాకుండా.. చాలా కాలం తర్వాత యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశాడు. ఈ సక్సెస్ కి ప్రధాన కారణం వెంకీ. ఆయనతో పాటు మామకు తగ్గ అల్లుడుగా నాగచైతన్య ఈ సినిమా విజయంలో సహకారం అదించారు. సెక్సెస్ అయ్యారు. దర్శకుడు బాబీ తనదైన మార్క్ కథ-కథనాలతో శభాష్ అనిపించాడు. ఈ సినిమా సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరి హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నా’అన్నారు చిరు.