ఈ చిన్నారి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా ?


అసలు బట్టలంటే పెద్దగా ఇష్టం లేనట్టుగా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. చిన్నప్పుడు బట్టలంటే.. ఇష్టం లేని ఈ చిన్నారు.. ఇప్పుడు మాత్రం నిండైన బట్టలతో అందంగా కనిపిస్తుంటుంది. తన అందం, అభినయంతో పెద్ద ఎత్తున అభిమానుల సొంతం చేసుకుంది. ఈ చిన్నారి.. ఎవరో కాదు.. మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.

ప్రేమమ్ తో తెలుగు తెరకు పరిచయం అయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన నితిన్ ‘అ ఆ’లో గయ్యాళీ కనిపించింది. కళ్లతోనే నటిస్తూ ఆకట్టుకుంది. ఆ తర్వాత శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ, రాక్షసుడు చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే అనుపమ తన వ్యక్తిగత, సినిమా విశేషాలని అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా, ఆమె చిన్ననాటి ఫోటోలని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ‘చిన్నప్పుడు బట్టలేసుకోవడం పెద్దగా ఇష్టం లేదని అర్థమవుతోంది’ కామెంట్ పెట్టింది. ఇక ప్రస్తుతం అనుపమ చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు. మలయాళంలో మాత్రం ఓ సినిమా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ టీమిండియా పేసర్ బుమ్రాతో డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.