ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తప్పిన ప్రమాదం

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కోసం ఆలేరులోని పీఆర్ గెస్ట్ హౌస్ కు సునీత వచ్చారు. చెక్కులు అందజేస్తున్న సమయంలో.. గెస్ట్ హౌస్ స్లాబ్ పెచ్చులు ఊడి కిందపడ్డాయి. ఈ ఘటనలో సునీత చేతికి పెచ్చు తగిలి గాయమైంది. ఇందిర అనే మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యేతో పాటు గాయపడిన మహిళని ఆలేరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆలేరు నియోజకవర్గం నుంచి గొంగొడి సునీత 2014, 2018లో వరుసగా రెండు సార్లు గెలుపొందారు. ఆమెకి మంత్రి పదవి ఖాయం అనుకొన్నారు. కానీ, సబితా ఇంద్రారెడ్డి తెరాసలోకి రావడంతో.. సునీతకి మంత్రి పదవి దక్కలేదని ఆమె అనుచరులు చెబుతుంటారు. ఇక ఇటీవల దిశ ఎన్ కౌంటర్ పై సునీత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. నిందితులని ఎన్ కౌంటర్ చేయడం తప్పు అన్నట్టుగా ఆమె మాట్లాడారు. నిందితుల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారోనని సునీత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.