శ్రద్దాగా డ్యాన్స్ చేస్తోంది

రెమో డిసౌజా దర్శకత్వంలో వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘స్ట్రీట్ డాన్సర్స్ 3’. అత్యున్నతనమైన డాన్స్ ప్రమాణాలతో నరాలు తెగే డాన్స్ మూవ్మెంట్స్ తో ఈ సినిమా తెరకెకుతోంది. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరున్న ప్రభుదేవా కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

బుధవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. పాకిస్థాన్ తో క్రికెట్ ఆడినా.. డ్యాన్స్ చేసినా వచ్చే మజాయే వేరని కథానాయకుడు వరుణ్ ధావన్ చెప్పడం ఆకట్టుకుంది. స్టన్నింగ్ స్టెప్పులు, అంతకంటే.. స్టన్నింగ్ అందాలతో ట్రైలర్ ని కట్ చేశారు. ఈ ట్రైలర్ పై టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ ప్రసంసలు కురిపించారు. వచ్చే యేడాది జనవరి 24న ‘స్ట్రీట్ డాన్సర్స్ 3’ ప్రేక్షకుల ముందుకు రానుంది.