రివ్యూ : రూలర్
చిత్రం : రూలర్ (2019)
నటీనటులు : బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, భూమిక తదితరులు
సంగీతం : చిరంతన్ భట్
దర్శకత్వం : కె.యస్ రవికుమార్
నిర్మాత : సి. కల్యాణ్
రిలీజ్ డేటు : డిసెంబర్ 20, 2019.
రేటింగ్ : 2.5/5
నటసింహం నందమూరి బాలకృష్ణ బరిలోకి దిగితే మాస్ కి పండగే. అందుకే బాలయ్య ఎక్కువగా మాస్, యాక్షన్ కథలనే ఎంచుకొంటున్నారు. వాటినే కాస్త ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూసుకుంటారు. బాలయ్య మరోసారి అలాంటి కథనే ‘రూలర్’ ఎంచుకొన్నాడు. ఈ చిత్రానికి సీనియర్ దర్శకుడు కె.యస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సి. కల్యాణ్ నిర్మాత. ‘జై సింహా’ తర్వాత వీరికాంబో తెరకెక్కిన చిత్రమిది. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన రూలర్ ఎలా ఉన్నాడు ? ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించాడు తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
ఉత్తరప్రదేష్ లో తెలుగు రైతులు సాగు చేసుకోవడానికి 2వేల ఎకరాలు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. ఠాగూర్ వంశానికి చెందిన భవానీ ఠాగూర్ అక్కడ రెవెన్యూ మంత్రిగా ఉంటాడు. ఆయన తెలుగు రైతులకి ఇచ్చిన భూములపై కన్నేస్తాడు. తెలుగు రైతులకి అండగా ఉన్న ఆయన అన్న, అన్నకూతురు భూమికని చంపేయాలని చూస్తాడు. తెలుగు రైతుల కుటుంబానికి చెందిన పోలీస్ ఆఫీసర్ ధర్మ (బాలయ్య) మంత్రికి ఎదురొడ్డి నిలుస్తాడు ? ఈ కథకి హైదరాబాద్లోని ఏషియన్ సాఫ్ట్వేర్ అధినేత అర్జున ప్రసాద్ (బాలయ్యకు) లింక్ ఏంటి ? అన్నది రూలర్ కథ.
ప్లస్ పాయింట్స్ :
* బాలయ్య ఎనర్జిటిక్ నటన
మైనస్ పాయింట్స్ :
* రొటీన్ కథ-కథనం
* బాలయ్య నటన తప్ప అన్నీ మైనస్సులే..
ఎలా ఉందంటే ?
దర్శకుడు కె.యస్ రవికుమార్ రొటీన్ కథని రాసుకొన్నాడు. దాన్నిఅంతే రొటీన్ గా తెరకెక్కించాడు. ఈ బీసీ కాలం నాటి కథని ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా లేదు. అసలు తెలుగు రైతులని యూపీ ప్రభుత్వానికి లింకు చేయడమే సరిగ్గాలేదు. సినిమాలో ఓ పాత్రకి బాలయ్య విగ్గే సరిగ్గా సెట్ కాలేదు. అంత నిర్లక్ష్యంగా సినిమా తీశారు.
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
కథ-కథనం పట్టించుకోకుండా బాలయ్య యాక్షన్ మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతాం. ఈ రొటీన్ యాక్షన్ కథని బాలయ్య తన ఎనర్టిటిక్ నటనతో నిలబెట్టే ప్రయత్నం చేశారు. యాక్షన్, డైలాగ్స్ ని బాలయ్య అభిమానులు ఎంజాయ్ చేస్తారు. ఈసారి డ్యాన్సుల్లోనూ బాలయ్య అదరగొట్టేశాడు. బాలయ్య తర్వాత కాస్త ప్రేక్షకులకి రిలాక్స్ పంచేది హీరోయిన్స్. సోనాల్ బికినీ ట్రిట్ తో కనువిందు చేసింది. వేదిక కూడా అందంగానే కనిపించింది. భూమిక, మిగతా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
చిరంతన్ భట్ అందించిన ట్యూన్స్ బాగున్నాయి. తెరపై చూడ్డానికి పాటలు బాగున్నాయి. ఆ పాటల్లో బాలయ్య డ్యాన్స్ హైలైట్. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో అనవసరపు సీన్స్ చాలానే ఉన్నాయి. రొటీన్ కథ కావడంతో టెక్నికల్ సినిమా వీక్ గా అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : పవర్ ఫుల్ టైటిల్ ‘రూలర్’తో రొటీన్ యాక్షన్ ని చూపించారు.
రేటింగ్ : 2.5/5