సితార పాప క్యూట్ డ్యాన్స్ చూశారా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార మరోసారి డ్యాన్స్ తో అదరగొట్టేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయిక. ఈ సిమవారం సరిలేరు నుంచి ‘#HeIsSoCute’ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సాంగ్ మీద సితార డ్యాన్స్ చేసింది.

ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు రష్మిక మందన అభిమానులు. ఇప్పుడీ వీడియాలో వైరల్ అవుతోంది. సితార పాప అదరగొట్టేసిందని చెబుతున్నారు. ఇప్పటికే సితార సోషల్ మీడియా స్టార్ గా మారారు. వంశీపైడిపల్లి కూతురుతో కలిసి సితార ఏకంగా ఓ యూట్యూబ్ చానల్ నే రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.