27న ఏపీ కేభినేట్ భేటీ

దేశంలో పౌరసత్వ సవరణ చట్ట బిల్లుపై సెగలు, ఏపీలో రాజధాని మంటలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజున సీఎం జగన్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులు జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

రాజధాని రైతులు మాత్రం సీఎం జగన్ ప్రకటనతో ఆందోళనలు చేస్తున్నారు. ఏపీకి అమరాతి ఒక్కటే రాజధానిగా ఉండాలని, ఇప్పుడు రాజధానిని ముక్కులు చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన మా బతుకులు ఏమైపోను అని ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం అమరావతి రైతులు ఆందోళనకి దిగడం, వారికి జనసేన, తెదేపా వర్గాలు మద్దతు ఇవ్వడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారినట్టు అనిపించింది.

మరోవైపు, సీఎం జగన్ మాత్రం రాజధాని విషయంలో కీలక నిర్ణయం తీసుకొనేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం జగన్ ను కలిసింది. గత మూడు నెలల నుండి అధ్యయనం చేసి ప్రజాభిప్రాయాలను సేకరించిన కమిటీ తుది నివేదికను జగన్ కు సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27న ఏపీ కేబినేట్ సమావేశమై రాజధానిపై కీలక నిర్ణయం తీసుకోబోటున్నట్టు సమాచారమ్.

ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించినట్టు.. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా ? మంత్రి పెద్దిరెడ్డి చెప్పినట్టు అమరావతి భూములని తిరిగి రైతులకి ఇచ్చేస్తారా ? అనేది ఈ నెల 27న ఏపీ కేబినేట్ సమావేశం తర్వాత క్లారిటీ రానుందని చెబుతున్నారు.