లావణ్య త్రిపాఠి ఇంట్లో సోదాలు.. ఎందుకంటే ?


టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంట్లో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. సర్వీస్‌ ట్యాక్స్‌ ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఎస్టీ అధికారులు శుక్రవారం హైదారాబాద్ లోని పలువురు ప్రముఖుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటితో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో డీజీజీఐ టీమ్స్‌ దాడులు జరిపారు.

చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో పాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలు వంటి ఆఫీసుల్లో ఉదయం నుంచి  జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నాయి. సోదాలు జరుగుతున్న సమయంలో లావణ్య ఇంట్లో లేరు. విషయం తెలుసుకొని షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరీ.. ఇంటికి చేరుకున్నారు. ఈ సోదాల్లో లావణ్య ఇంట్లో దాదాపు రూ. 20లక్షల బ్లాక్ మణి పట్టుబడినట్టు సమాచారమ్.