సీఎం జగన్’ని విష్ చేసిన కేటీఆర్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ సీఎం జగన్ ని విష్ చేశారు.

జగన్ సీఎం కాకముందు నుంచి ఆయనకి టీఆర్ఎస్ మద్దతిస్తూ వస్తుంది. 2014లోనే జగన్ సీఎం అవుతాడని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కానీ, అతి విశ్వాసం కారణంగానే 2014లో వైకాపా అధికారంలోకి రాలేకపోయిందని పలు సందర్భాల్లో కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం జోక్యం లేకుండానే విభజన సమస్యలని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.