ఆ విష‌యంలో తెలంగాణ గ్రేట్.. !!

ఏపీ ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా ఉన్న ప‌వన్ క‌ళ్యాణ్ తెలంగాణ గొప్ప‌ద‌నాన్ని ఏపీలో చెప్పుకొచ్చారు. విజ‌య‌వాడ‌లో పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశం ఏర్పాటు చేసిన ఆయ‌న టీడీపీకి మ‌ద్ద‌తు ఎందుకిచ్చానో అనే విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. ఏపీలో కుల రాజ‌కీయాలు ఎక్కువ‌య్యాయ‌ని, విజ‌య‌వాడ గురించి చెప్పాలంటే వంగ‌వీటి రంగా గురించి ప్ర‌స్తావించనిదే బెజ‌వాడ రాజ‌కీయాల గురించి చెప్ప‌లేమ‌న్నారు.

ఏపీలో కులాల పేరుతో గొడ‌వ‌లు, రాజ‌కీయాలు ఉండ‌కుంటా ఉంటేనే ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి అభివృద్ధి చెందుతుంది. ఏపీలో ముందుగా అడిగే ప్ర‌శ్న మీరు ఏకులం అని. అది ప‌క్క‌న‌బెట్టి కుల అస‌మాన‌త‌లు లేని ఏపీని చూడాల‌నుకుంటున్నాన‌న్నారు. ఈ విష‌యంలో తెలంగాణ బెట‌ర్ అంటూ కితాబునిచ్చారు. తెలంగాణ ప్ర‌జ‌లు ముందుగా ప్రాంతానికి విలువిస్తార‌ని, ఆ త‌రువాతే కులం ప్ర‌స్తావ‌న తెస్తార‌ని అన్నారు.