పూరి రాసిన రొమాంటిక్ సాంగ్ విన్నారా ?

దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరిని తన శిష్యుడు అనిల్ పాడూరి చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే. అనిల్ పాడూరి దర్శకత్వంలో ఆకాష్‌ పూరి-కేతికా శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ రొమాంటిక్ కథని పూరినే రాశాడు. అంతేకాదు.. ఓ రొమాంటిక్ సాంగ్ కూడా రాశాడు. అదే.. ‘నువ్వు నేను ఈ క్షణం..’.

ఈ పాటని సినిమాలో తొలిసాంగ్ గా శనివారం విడుదల చేశారు. గోవా బీచ్ లో ఈ సాంగ్ ని చిత్రీకరించారు. “దేశాన్ని ప్రేమించడం వేరు. ఆడదాన్ని ప్రేమించడం వేరు. ఐ లవ్ యూ ఇండియా.. రూపాయి ఖర్చు ఉండదు. ఐ లవ్ యూ సరదా తీరిపొద్ది..” అంటూ మొదలెట్టిన పూరి.. ఓ అమ్మాయి అబ్బాయి కోసం కన్న కలలని పదాలుగా రాశాడు. ఆ రొమాంటి పదాలు ఆడది కూడా మగాడిలాగే తోడు కోసం పరితపించిపోతుందని చెప్పాయి. పూరి మార్క్ రొమాంటిక్ మాటాలతో కూడిన సాంగ్ అదిరిపోయింది.