కేతికా.. కాక పుట్టిస్తోంది.. !

కేతికా శర్మ.. తెలుగు తెరకు పరిచయం కాబోతున్న కొత్త హీరోయిన్. దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ అమ్మాయికి సినిమా కొత్తే. కానీ, పాపులరీ కాదు. సోషల్ మీడియాలో బాగా ఫేమస్. మోడల్, సింగర్ అయిన కేతికా చేసిన డబ్ స్మాష్ వీడియోలు చాలా పేమస్.

ఈ బ్యూటీకి ఇన్ స్టా గ్రామ్ లో 1.2మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే.. ఎంత ఫేమస్ ఫిగరో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. రొమాంటిక్ సినిమా రిలీజ్ కి ముందే హాట్ హాట్ ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో వదిలి కాకరేపుతోంది. చూస్తుంటే.. చాలా వేగంగా టాలీవుడ్ లో జెండా పాతేలా కనిపిస్తోంది.

ఇక శనివారం విడుదలైన రొమాంటిక్ సాంగ్ లోనే ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. చూస్తుంటే.. ఈ బ్యూటీకి అందాల ఆరబోతలో ఎలాంటి కండీషన్స్ పెట్టుకోనట్టుంది. రొమాంటిక్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్న కేతికా.. స్టార్ హీరోయిన్ అనిపించుకుంటోందేమో చూడాలి.